విజయవాడలో పెను ప్రమాదం తప్పింది. నిన్న అర్దరాత్రి మచిలీపట్నం -తిరుపతి ఎక్స్‌ప్రెస్ కు ప్రమాదం తప్పింది. మచిలీపట్నం నుంచి తిరుపతి వెళుతుండ గా టంగుటూరు వల్ల బోగి ల్లోకి పొగలు వ్యాపించాయి. దీంతో అప్రమత్తమై చైన్ లాగి ట్రైన్ ను ఆపారు ప్రయాణికులు. బ్రేక్స్ లో ఉండే లూబ్రికెంట్ అయిపోవడం వల్ల చక్రాల రాపిడితో వ్యాపించాయి పొగలు.
దీంతో భయబ్రాంతులకు గురై.. ట్రైన్ దిగిపోయారు ప్రయాణికులు ఇక అటు హుటాహుటిన పరిస్దితిని కంట్రోల్ కి తెచ్చింది రైల్వే సిబ్బంది. 20 నిమిషాల తరువాత తిరిగి బయలుదేరింది ట్రైన్. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఒడిశా రైలు ప్రమాదంపై రైల్వేశాఖ కీలక ప్రకటన చేసింది. ఈ రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 275 గా రైల్వేశాఖ అధికారికంగా ప్రకటించింది. కానీ అటు ఇప్పటి వరకు స్పష్టత రాలేదు మృతుల సంఖ్య. జనరల్ బోగీల్లో ప్రయాణించిన వారి శవాలను గుర్తించడంలోనే సమస్య తలెత్తుతోందని వెల్లడించింది రైల్వేశాఖ.