దళిత యువకుడిపై దాడి సంఘటన గురించి తెలిసిందే. అయితే మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందించి మీడియాతో మాట్లాడారు.
యువకుని పై దాడి చేసిన సంఘటన చాలా బాధాకరం అని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు తక్షణమే స్పందించారు.దాడి చేసిన వ్యక్తులపై ఇప్పటికే కేసు నమోదు చేసి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఈ ఘటనను టీడీపీ రాజకీయాలకు వాడుకోవాలని చూడటం నీచమైన చర్య అన్నారు. తప్పు చేసిన వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా శిక్ష తప్పదు హెచ్చరించారు. ఇటువంటి ఘటనలను మా ప్రభుత్వం సహించదు అని తెలిపారు.
చట్టం ముందు ఎవరైనా సమానమే.. టీడీపీ నాయకులకు ప్రతి విషయాన్ని రాజకీయం చేయటం అలవాటు. కేసులో నేను జోక్యం చేసుకున్నానని టీడీపీ నేతలు ఆరోపణలు చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. కంచికచర్ల పోలీసులతో నేను మాట్లాడినట్టు నిరూపిస్తే దేనికైనా సిద్దమని సవాల్ చేస్తున్నానని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. దళితుల పట్ల దాడి చేయడం దారుణమని పేర్కొన్నారు మంత్రి సురేష్.