కాకినాడ పోర్టులో నిఘా.. వైజాగ్ పోర్ట్ నుండి బియ్యం స్మగ్లింగ్..!

-

బియ్యం స్మగ్లింగ్ కు వైజాగ్ పోర్ట్ గేట్ వే గా మారింది. మంత్రి నాదెండ్ల మనోహర్ అకస్మిక తనిఖీల్లో ఈ అక్రమ రవాణా బయట పడింది. కంటైనర్ ఫ్రైట్ స్టేషన్లో ఎగుమతికి సిద్ధంగా ఉన్న ను బియ్యం సీజ్ చేసారు. రాయపూర్ కు చెందిన AGS ఫుడ్స్ పేరుతో కన్ సైన్ మెంట్ వెళ్తుంది. 480 మెట్రిక్ టన్నులు సివిల్ సప్లైస్ బియ్యం సీజ్ చేసాయి ప్రత్యేక బృందాలు. అయితే కాకినాడ పోర్టులో నిఘా పెరగడంతో రెండు నెలలుగా విశాఖ పోర్ట్ ను స్మగ్లింగ్ కోసం ఎంచుకున్నారు.

అయితే ఈ ఘటన పై మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. గత మూడేళ్లలో కాకినాడ పోర్టు నుంచి కోటి 38లక్షల మెట్రిక్ టన్నులు రేషన్ బియ్యం అక్రమ రవాణా అయ్యింది. విశాఖ నుంచి 36 వేల మెట్రిక్ టన్నులు అక్రమ రవాణా జరగగా దాని విలువ 12 వేల కోట్లు గా గుర్తించాం. కాకినాడ పోర్టు పై నిర్భంధం పెరగడంతో రెండు నెలల్లో 70 వేల మెట్రిక్ టన్నులు బియ్యం విదేశాలకు తరలిపోయింది. చెడిపోయిన బియ్యం అక్రమ రవాణా చేయడం వల్ల దేశానికి చెడ్డ పేరు వస్తోంది అని నాదెండ్ల మనోహర్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version