వైసీపీకి వ్యతిరేక ఓటు చీలకూడదనే నా లక్ష్యం అని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు పలికాం. మేము ఎన్ని చోట్ల పోటీ చేస్తాం. ఎన్ని చోట్ల పొత్తు పెట్టుకుంటామనేది మీకు అనవసరం. మోడీ జీ-20 ప్రోగ్రామ్ లో బిజీగా ఉన్నప్పుడు చంద్రబాబు అరెస్ట్ చేశారు. అప్పుడే నేను పొత్తు గురించి ప్రకటించాను. తెలంగాణకు ఇచ్చిన వరాలు ఏపీకి ఎందుకు ఇవ్వలేదని ఢిల్లీలో అడగాలి. నేను నా ప్రోగ్రామ్స్ కోసం వెళ్తే నన్ను ఆపేశారు. టీడీపీతో సమన్వయం కోసమే ఐదుగురితో జనసేన కమిటీ వేశామని తెలిపారు.
వైసీపీ ఎంపీలు 30 మంది వున్నారని.. వాళ్లు ఢిల్లీకి వెళ్లి క్యాషూ బోర్డ్, కోకనట్ బోర్డు గురించి అడగాలని ఆయన ప్రశ్నించారు. అంతేకానీ మీపై వున్న కేసులు వాయిదా వేయించుకోవడం కాదని పవన్ చురకలంటించారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదన్నదే తన లక్ష్యమని .. ఢిల్లీలో బీజేపీ నేతలతో కూడా ఇదే విషయం చెప్పానని జనసేనాని స్పష్టం చేశారు. తాము ఎన్ని చోట్ల పోటీ చేస్తాం.. ఎవరితో పొత్తు పెట్టుకుంటామనేది మీకు అనవసరమని వైసీపీ నేతలకు చురకలంటించారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన రోజున తన కార్యక్రమాల కోసం వెళ్తుంటే తనను ఆపేశారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీతో సమన్వయం కోసం ఐదుగురితో జనసేన పార్టీ కమిటీ వేసిందన్నారు. తెలంగాణకు ఇచ్చిన వరాలు.. ఏపీకి ఎందుకు ఇవ్వలేదని ఢిల్లీకి వెళ్లి అడగాలని ఆయన దుయ్యబట్టారు.