హిందూపురం అభివృద్ధిపై బాలయ్య సెంటీమెంట్ డైలాగులు వేశారు. శ్రీ సత్యసాయి జిల్లాలో బాలకృష్ణ మాట్లాడుతూ.. గతంలో హిందూపురం అభివృద్ధి చేసింది నందమూరి తారక రామారావు అని కొనియాడారు. ఆయన హయాంలో పారిశ్రామిక వాడ, కళాశాలలు ఏర్పాటు చేశారని గుర్తు చేశారు.
ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అది చంద్రబాబు తోనే సాధ్యమని వెల్లడించారు. ప్రస్తుత ప్రభుత్వంలో అభివృద్ధి వెనక్కి వెళ్ళిందని తెలిపారు. టిడిపి హయంలో హిందూపురాన్ని అభివృద్ధి ఎంతో చేశామని స్పష్టం చేశారు బాలకృష్ణ. ఇప్పుడు మరోసారి అవకాశం ఇస్తే హిందూపురం నియోజకవర్గం మరింత అభివృద్ధి చేస్తామని వెల్లడించారు బాలకృష్ణ.