BREAKING : రేపటి నుంచే నారా లోకేష్‌ పాదయాత్ర పునః ప్రారంభం

-

BREAKING : రేపటి నుంచే నారా లోకేష్‌ పాదయాత్ర పునః ప్రారంభం కానుంది. రేపటి నుంచి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభం అవుతుంది. ఈ మేరకు నారా లోకేష్ పాదయాత్ర కు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 29వ తేదీ అంటే రేపటి నుంచే రాత్రి 8.15 గంటలకు తిరిగి ప్రారంభం కానుంది లోకేష్ యువగళం పాదయాత్ర. ఎక్కడ ఆగిందో అక్కడి నుంచే పాదయాత్ర ప్రారంభం కానుంది.

ఈ నెల 8న రాజోలు నియోజకవర్గంలో ఆగింది నారా లోకేష్‌ పాదయాత్ర. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో ఈ నెల 9న పాదయాత్ర సైట్ నుంచి విజయవాడ వెళ్లిన నారా లోకేష్…తన పాదయాత్రను అర్ధాంతరంగా ఆపేశారు. ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు లోకేష్. ఇక 20 రోజుల తర్వాత తిరిగి ప్రారంభం కానుంది నారా లోకేష్‌ పాదయాత్ర. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు టీడీపీ పార్టీ కార్యకర్తలు. కాగా.. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న లోకేష్‌.. ఇవాళ ఏపీకి రానున్నారని సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version