నారా లోకేష్ యువగళం పాదయాత్ర వాయిదా

-

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర పున:ప్రారంభ తేదీ వాయిదా పడింది. చంద్రబాబు అరెస్ట్ తరువాత చోటు చేసుకున్న పరిణామాల  నేపథ్యంలో ఈనెల 09న ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలో పాదయాత్ర నిలిపివేసిన విషయం విధితమే. దాదాపు 20 రోజుల తరువాత సెప్టెంబర్ 29న రాత్రి 8.15 గంటలకు పాదయాత్ర తిరిగి ప్రారంభించాలని నిర్ణయించారు. కానీ అక్టోబర్ 03న స్కిల్ డెవలప్ మెంట్  కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో వాదనలు ఉన్నందున యువగళం పాదయాత్ర పున:ప్రారంభ తేదీని వాయిదా వేసుకోవాలని పార్టీ ముఖ్యనేతలు లోకేష్ ని కోరారు.

కక్ష సాధింపుతో పలు కేసులు తెరపైకి తీసుకొచ్చి పార్టీ అధినేత చంద్రబాబును ప్రభుత్వం ఇబ్బంది పెడుతున్నందున ఢిల్లీలో న్యాయవాదులతో లోకేష్ సంప్రదింపులు చేయాల్సిన అవసరం ఉందని నేతలు అభిప్రాయపడ్డారు. పాదయాత్రలో ఉంటే న్యాయవాదులతో సంప్రదింపులు, ఇతర కార్యక్రమాల పర్యవేక్షణ కష్టం అవుతుందని లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. పార్టీ నేతల అభిప్రాయాలతో ఏకీభవించిన లోకేష్ యువగళం పాదయాత్ర పున:ప్రారంభ తేదీని వాయిదా వేసుకోవాలని నిర్ణయించారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version