ఇసుక బుకింగ్స్ లో మార్పులు వివరించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్..!

-

రేపట్నుంచి స్టాక్ పాయింట్ల వద్ద నుంచి బుకింగ్స్ ఉండవు. నిర్ధేశించిన బుకింగ్ పాయింట్ల వద్దే బుకింగ్స్ జరుగుతాయి అని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.సృజన తెలిపారు. రేపట్నుంచి నాలుగు స్టాకు పాయింట్ల వద్దే ఇసుక అందుబాటులో ఉంటుంది. కీసరకు సంబంధించి కంచికచర్ల 3వ సచివాలయం వద్ద.. మొగులూరుకు సంబంధించి అనుమంచిపల్లికి సంబంధించి చెవిటికల్లు సెక్రటేరియట్ వద్ద.. అనుమంచిపల్లికి సంబంధించి షేర్ మహ్మది పేట పంచాయతీ కార్యాలయం వద్ద.. పోలంపల్లికి సంబంధించి పోలంపల్లి గ్రామ సచివాలయం వద్ద బుకింగ్ పాయింట్స్ ఉంటాయి.

రేపు ఉదయం 6 గంటలకు బుకింగ్ ప్రారంభిస్తాం. బుకింగ్ చేసుకునే వారికి స్లాట్ విధానంలో ఇసుక ఇస్తాం. ఏ సమయంలో స్టాకు పాయింట్ వెళ్లాలో కూడా చెబుతాం. ఏ స్లాట్ లో ఇసుక తీసుకోవచ్చో ఇన్వాయిస్ మీద రాస్తాం. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 వరకూ బుకింగ్స్ ఉంటాయి. సాయంత్రం 6 తర్వాత ఇసుక లోడింగ్ ఉండదు. ఇన్వాయిస్ లేని వారు వస్తే వెనక్కి పంపించేస్తాం. అలాగే రిజిస్టర్డ్ వాహనాలకు మాత్రమే బుకింగ్ ఇన్వాయిస్ లు ఇస్తాం. వాహనం పరిమితి…దూరాన్ని బట్టి ట్రాన్స్ పోర్టు ఛార్జీలను ఖరారు చేశాం. ట్రాన్స్ పోర్టు, బుకింగ్ ఛార్జీలు వెబ్ సైట్ లో పెడతాం. అలాగే తెలంగాణకు దగ్గరగా ఉన్న స్టాక్ పాయింట్ల పై ప్రత్యేక నిఘా ఉంటుంది అని కలెక్టర్ జి.సృజన పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version