కోర్టులోకి తీసుకెళ్లే సమయంలో పిన్నెల్లికి ఎదురువచ్చాడు టీడీపీ కార్యకర్త కొమెర శివ. ఈ సమయంలో పిన్నెల్లిపై దాడి చేసేందుకు ప్రయత్నించాడు. కానీ పోలీసులు అలర్ట్ అయ్యారు. కానీ అంతులోనే.. కొమెర శివను కడుపులో గుద్దారు పిన్బెల్లి రామకృష్ణారెడ్డి. పోలీసులు జోక్యం చేసుకోవడంతో.. పరిస్థితి సద్దుమణిగింది. కాగా పల్నాడు జిల్లా మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించారు.
పాల్వాయి గ్రామంలో టీడీపీ ఏజెంట్ నంబూరు శేషగిరిరావు, కారంపూడిలో సిఐ నారాయణ స్వామి పై హత్యాయత్నం కేసులో రిమాండ్ విధించిన మాచర్ల ధర్మస్థానం..పిన్నెల్లిని నెల్లూరు సబ్ జైలు కు తరలించాలని ఆదేశాలు ఇచ్చింది. మొత్తం పిన్నెల్లి పై నాలుగు కేసుల్లో రెండు కేసుల్లో బెయిల్.. మరో రెండు కేసుల్లో రిమాండ్ విధించింది.
పాల్వాయి గేటు ఈవిఎం ధ్వంసం కేసు, అక్కడే మహిళపై దాడి కేసులో పిన్నెల్లికి బెయిల్ మంజూరు చేశారు. కారంపూడి అల్లర్ల కేసులో పెట్రోల్ పోసి కారు, ఇంటికి నిప్పు పెట్టిన కేసులో ప్రధాన నిందితుడిగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నారు. రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు జరిగిన ఇరు న్యాయవాదుల వాదనలు విన్న కోర్టు..రిమాండ్ విధించింది.