ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పీపీకే రామాచార్యులుకు కీలక పదవి కట్టబెట్టింది. ఏపీ అసెంబ్లీకి కన్సల్టెంటుగా రాజ్యసభ రిటైర్డ్ సెక్రటరీ జనరల్ పీపీకే రామాచార్యులును నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఏపీ అసెంబ్లీకి మొదటి సారిగా కన్సల్టెంట్ పోస్ట్ క్రియేట్ చేసింది జగన్ ప్రభుత్వం.
గతంలో ఏపీ అసెంబ్లీకి స్పెషల్ సెక్రటరీగా 3 నెలలు పాటు పని చేసిన పిపికే రామాచార్యులు… ప్రస్తుతం రాజ్యసభ అడ్వైజరుగా పని చేస్తున్నారు. వెంకయ్యనాయుడు ఉప రాష్ట్రపతి అయ్యాక ఆయన హయాంలో రాజ్యసభ సెక్రటరీ జనరల్ గా పనిచేశారు పిపికే రామాచార్యులు. ఏడాది పాటు ఈ పదవిలో కొనసాగనున్న పిపికే రామాచార్యులు… ఆగష్టు 10 నుంచి ఈ నియామకం చేసినట్లుగా తాజాగా ఉత్తర్వులిచ్చింది జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం.