అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత నుండి వైసీపీ పార్టీకి అలాగే జగన్ కు వరుస షాకులు తగులుతున్న విషయం తెల్సిందే. ముఖ్య నాయకులు చాలా మంది పార్టీకి వదిలేసి పోతున్నారు. ఇక ఇప్పుడు అదే దారిలో తన వైసీపీ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసారు ఆర్ కృష్ణయ్య. నిన్న రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ లేఖ ఇచ్చారు ఆర్ కృష్ణయ్య. అయితే తాజాగా ఆర్ కృష్ణయ్య ఇచ్చిన రాజీనామాను ఆమోదించాటారు రాజ్యసభ చైర్మన్.
ఆర్ కృష్ణయ్య స్థానం ఖాళీ అయిందంటూ బులిటెన్ విడుదల చేసారు రాజ్యసభ సెక్రటరీ. అయితే రాజ్యసభలో గతంలో 11 మంది వైసీపీ తరఫున ఎంపీలు ఉండగా.. అందులో నుండి ఇప్పటికే రాజీనామా చేసారు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావులు. ఇక ప్రస్తుతం ఆర్ కృష్ణయ్య రాజీనామా చేసారు. అయితే కృష్ణయ్య రాజీనామాతో రాజ్యసభలో వైసీపీ ఎంపీల సంఖ్య 8కి పడిపోయింది. ఇక ప్రస్తుతం విద్యానగర్ లోని తన నివాసంలో ఉన్నారు ఆర్ కృష్ణయ్య.