ప్రత్యేక ‘హోదా’ కోసం రేపు ఢిల్లీలో షర్మిల దీక్ష

-

APCC చీఫ్ షర్మిల ఇవాళ ఢిల్లీకి వెళ్ళనున్నారు. విభజన హామీల అమలు ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ తో రేపు ఒకరోజు దీక్ష చేయనున్నారు. అలాగే కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్ అపాయింట్మెంట్ కోరినట్లు తెలుస్తోంది.

Sharmila’s initiation in Delhi tomorrow for a special statues

కాగా, ఈనెల 5 నుంచి 11 వరకు షర్మిల పలు జిల్లాల్లో రోడ్ షోలు, సభల్లో పాల్గొననున్నారు. 5న మడకశిర, 6న మాచర్ల, 7న బాపట్ల, 8న జంగారెడ్డిగూడెం, 9న తుని, 10న పాడేరు, 11న నగరిలో పర్యటిస్తారు. ఇది ఇలా ఉండగా, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భద్రతపై కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ షర్మిలకు భద్రతను పెంచాలని కాంగ్రెస్ నేతలు డీజీపీని కోరారు. ఆమెకు 1+1 భద్రత మాత్రమే కల్పిస్తున్నారని డీజీపీకి ఫిర్యాదు చేసిన నేతలు.. షర్మిలకు 4+4 భద్రత, ఎస్కార్ట్ వాహనం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. గతంలో ఆమెకు 4+4 భద్రత ఉండేదని.. పీసీసీ అధ్యక్షురాలు అయ్యాక భద్రతను కుదించారని పేర్కొన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version