ఏపీ డీజీపీకి అందిన సిట్ నివేదిక.. సంచలన విషయాలు వెలుగులోకి..!

-

ఏపీ ఎన్నికల వేళ, పోలింగ్ తర్వాత జరిగిన ఘటనలపై రాష్ట్ర డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాకు సిట్ ప్రాథమిక నివేదిక అందింది. తిరుపతి, అనంతపురం, పల్నాడులో పర్యటించిన సిట్ బృందం.. అల్లర్లకు సంబంధించిన అన్ని వివరాలను తెలుసుకుంది. అల్లర్లు జరిగిన ప్రదేశాలను పరిశీలించింది. పలువురి నుంచి వివరాలు సేకరించింది. ఆయా పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులపై ఆరా తీసింది. అల్లర్ల వెనుక మరికొంతమంది ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు వారిపై కేసులు పెట్టాలని పోలీసులను ఆదేశించింది. ముఖ్యంగా భద్రతా వైఫల్యం వల్లే అల్లర్లు చెలరేగాయని గుర్తించింది.

అల్లర్ల సమాచారం ఉన్నా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు నిర్ధారించింది. స్థానిక నేతలతో పలువురు అధికారులు కుమ్మక్కయ్యారని, హింస జరుగుతున్న పట్టించుకోలేదని గుర్తించింది. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో మొత్తం 33 హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నట్లు గుర్తించింది. 150 పేజీల నివేదికను తయారు చేసి డీజీపీకి అందజేసింది. ఇక ఎన్నికల ఫలితాల సందర్భంగా జూన్ 4 తర్వాత ఉద్రిక్తత ఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉందని, భద్రతా పరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర అధికారులకు కొన్ని సిఫార్సులు చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version