వైసీపీ 123 స్థానాలు సాధిస్తుంది – పరిపూర్ణానంద స్వామీజీ

-

వైసీపీ 123 స్థానాలు సాధిస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు హిందూపురం స్వతంత్ర అభ్యర్థి పరిపూర్ణానంద స్వామి. ఏపీ ఎన్నికల ఫలితాలపై పరిపూర్ణానంద స్వామి జోస్యం చెప్పారు. వైసీపీ 123 సీట్లతో అధికారం లోకి వస్తుందని నాకు సమాచారం ఉందని చెప్పారు హిందూపురం స్వతంత్ర అభ్యర్థి పరిపూర్ణానంద స్వామి… కేంద్రంలో బీజేపీ, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో వైసీపీ అధికారం లోకి వస్తుంది.

Spiritual Leader Swami Paripoornananda on ap results

నాకు పక్కా సమాచారం ఉందని… ప్రెస్‌ మీట్‌లో హిందూపురం స్వతంత్ర అభ్యర్థి పరిపూర్ణానంద స్వామి ప్రకటించారు. దేశంలో ఎన్డీఏ కూటమి మరోసారి అధికారం చేపడుతుంది…మూడోసారి మోడీ ప్రధాని అవుతారన్నారు. ఏపీలో వైసిపి 123 స్థానాలు సాధిస్తుంది రెండోసారి జగన్ సీఎం అవుతారు…ముఖ్యమైన వ్యక్తి ద్వారా అందిన సమాచారం మేరకే చెబుతున్నానని పేర్కొన్నారు. హిందూపురంలో ఊహించని పరిణామం చూడబోతున్నారని వివరించారు. గ్రామీణ ప్రాంతాల మహిళలు అధిక శాతం వైసీపీకే ఓట్లు వేశారని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version