సోషల్ మీడియాలో ఆ పనులు చేస్తే కఠిన చర్యలు: డి‌జి‌పి హరీష్ కుమార్ గుప్తా

-

 

కౌంటింగ్ తర్వాత మీ అంతు చూస్తామంటూ కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియా వేదికగా ప్రత్యర్థి శిబిరాలకు సవాలు విసురుతూ సమాజంలో అశాంతి సృష్టిస్తున్నారు. మరి కొందరు వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ ఉద్రిక్తలు సృష్టిస్తున్నారు. అట్టి వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, వారిపై IT act కింద కేసులు నమోదు చేయడంతో పాటు రౌడీ షీట్లు ఓపెన్ చేయటం, PD ACT ప్రయోగించడం వంటి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని డి‌జి‌పి హరీష్ కుమార్ గుప్తా ఒక పత్రికా ప్రకటనలో పేర్కొనడం జరిగింది.

Strict action will be taken if those acts are done on social media DGP Harish Kumar Gupta

అట్టి పోస్టులు ఎవరి ప్రోద్భలంతో పెడుతున్నారో కూడా విచారణ చేస్తామనీ, అట్టివారిని కూడా ఉపేక్షించబోమని హెచ్చరించారు. అట్టి పోస్టులను, ఫోటోలను , వీడియోలను వాట్సాప్ స్టేటస్ గా పెట్టుకోవడం లేదా షేర్ చేయడం కూడా నిషిద్ధం. గ్రూప్ అడ్మిన్ లు కూడా అటువంటి వాటిని ప్రోత్సహించకూడదని తెలియచేసారు. ఈ విషయాన్ని అందరు గమనించగలరు. సోషల్ మీడియా పోస్టులపై పోలీస్ శాఖ నిరంతర నిఘా ఉంటుందనే విషయాన్ని గుర్తించుకోవాలని హితవు పలికారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version