తిరుమల టిటిడి ఇఓగా భాధ్యతలు స్వీకరించే సమయంలో వ్యవస్థలో లోపాలను సరిదిద్దాలని సియం చంద్రబాబు ఆదేశించారని ఇఓ శ్యామలరావు పేర్కొన్నారు. తిరుమల స్వామివారికి సమర్పించే అన్నప్రసాదాలు మొదలుకోని,లడ్డు ప్రసాదం,భక్తులుకు అందించే అన్నప్రసాదాలు నాణ్యత పెంచాలని సియం చంద్రబాబు ఆదేశించారు… ఆన్ లైన్ లో జారి చేసే దర్శన టిక్కేట్ల జారిలో లోపాలను గుర్తించి సరిదిద్దాలని సియం ఆదేశించారన్నారు.
క్షేత్రస్థాయిలో పరిశిలన చాలా లోపాలను గుర్తించామని… సర్వదర్శనం భక్తులుకు క్యూ లైనులో అన్నప్రసాద వితరణ సరైన రీతిలో జరగడం లేదని వివరించారు. క్యూ లైనులో వేచి వున్న చంటిబిడ్డలకు పాలు అందించడం లేదని.. క్యూ లైనులో వేచివున్న భక్తులుకు కనీస సమాచారం అందించే వ్యవస్థ కూడా లేనట్టు పిర్యాదులు అందాయన్నారు. క్యూ లైనులో నూతనంగా మూడు అన్నప్రసాద వితరణ కేంద్రాలు ఏర్పాటు చేసామన్నారు. వారంతం రద్ది సమయంలో భక్తుల సౌకర్యాలు పర్యవేక్షణకు యస్వీబిసి సిఇఓకి భాధ్యతలు అప్పగించామని… అన్నప్రసాద కాంప్లేక్స్ లో నిత్యం 2 లక్షల మంది భక్తులుకు అన్నప్రసాద సౌకర్యం కల్పించేలా ఏర్పాట్లు తెలిపారు ఇఓ శ్యామలరావు.