వైసీపీ పార్టీ గుర్తింపు రద్ధు చేసేందుకు టీడీపీ కుట్రలు !

-

వైసీపీ పార్టీ గుర్తింపు రద్ధు చేసేందుకు టీడీపీ కుట్రలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి మాట్లాడారు. సోషల్ మీడియాలో సజ్జల‌ బార్గవ రెడ్డి బ్యాచ్ అరచకాలు చేసాడని ఆగ్రహించారు. ఏపీ డిజిటల్‌ కార్పోరేషన్ నుంచి 65 మందికి లక్షల జీతాలు ఇచ్చారని సంచలన ఆరోపణలు చేశారు సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి.

TDP conspiracies to cancel YCP party recognition

ప్రత్యర్థులను వ్యక్తిత్వ హననం చేశారని వివరించారు సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి. ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుని ప్రతిపక్షాన్ని టార్గెట్ చేసిందని ఆగ్రహించారు సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి. కేంద్ర ఎన్నికల ఎలక్షన్ కమిషన్ వైసీపీ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి. ఎలక్షన్ కమిషన్ వైసీపీ పార్టీ గుర్తింపు రద్ధు చెయ్యాలని ఎన్నికల‌ కమీషన్ ను కోరతామన్నారు. సోషల్ మీడియాలో పనిచేస్తున్న వారికి ఎపీ ఫైబర్, ఎపీ డిజిటల్ కార్పోరేషన్ లో వీరికి జీతాలు చెల్లించారు. ఇది రాజ్యాంలో వుందా ? అంటూ ప్రశ్నించారు సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version