శ్రీకాకుళం జిల్లా ఎస్పీని కలిసిన టిడిపి నేతలు

-

శ్రీకాకుళం జిల్లా ఎస్పీ ని కలిశారు టిడిపి నేతలు ఎంపీ రామ్మోహన్ నాయుడు, గౌతు శిరీష. పలాస సిఐ శంకరరావు పై ఫిర్యాదు చేశారు టిడిపి నేతలు. ఈ సందర్భంగా ఎంపీ రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. పలాస సిఐ కార్యాలయం వైసీపీ కార్యాలయంగా పనిచేస్తుందని ఆరోపించారు. మంత్రి అప్పలరాజు కనుసన్నల్లో స్థానిక పోలీసులు పనిచేస్తున్నారని మండిపడ్డారు ఎంపీ రామ్మోహన్ నాయుడు.

ఫిర్యాదు చేయటానికి వెళ్లిన బాధితులకు న్యాయం జరగడం లేదన్నారు. ఫిర్యాదు చేసిన వారిపైనే తిరిగి కేసులు పెడుతున్నారని ఆరోపించారు. వజ్రపుకొత్తూరు మండలం గునుపల్లి కి చెందిన ధనలక్ష్మి పై వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధి బెదిరింపులకు దిగాడని.. ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినా ఇప్పటివరకూ కేసు నమోదు చేయలేదన్నారు. ప్రజలకు పోలీసులు పై నమ్మకం పోతోందన్నారు ఏంటి రామ్మోహన్ నాయుడు. పలాస సిఐ శంకర్రావు పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version