ఈ భూమి మీద ఏ మనిషి చేయనన్ని నేరాలు, ఘోరాలు చేసిన వ్యక్తి జగన్. 31 కేసుల్లో ముద్దాయి గా ఉంటూ బెయిల్ పై బయట తిరుగుతున్న జగన్.. లోకేష్ పై విమర్శలు చేయడం సిగ్గుచేటు అని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ అన్నారు. వైసీపీ నేతలు చంద్రబాబు గారిని ఏకవచనంతో మాట్లాడితే నాలుక కోస్తాం అని హెచ్చరించారు. ఒక్క ఛాన్స్ పేరుతో జగన్ ఐదేళ్లు ఆంధ్ర రాష్ట్రాన్ని పీడలా పట్టిపీడించారు. ల్యాండ్, శాoడ్, వైన్, మైన్ మాఫియాలతో వేలకోట్లు దోచుకున్నారు. చంద్రబాబు నాయుడు 72 శాతం పూర్తిచేసిన పోలవరాన్ని జగన్ నిర్వీర్యం చేశారు.
గతంలో పంచాయతీరాజ్ మినిస్టర్ గా గ్రామాల్లో 25 వేల కి.మీ సీసీ రోడ్లు, 23 లక్షల ఎల్ఈడి బల్బులు వేసిన ఘనత లోకేష్ ది. ఐటీ మినిస్టర్ గా తొలి ఆరు నెలల్లోనే యువతకు లక్ష ఉద్యోగాలు కల్పించేందుకు లోకేష్ కృషి చేస్తున్నారు. దిశా చట్టం ఎక్కడుంది వైసీపీ నేతలకు మైండ్ బ్లాక్ అయిందా.. వైసీపీ పాలన మహిళలపై రెండు లక్షలకు పైగా నేరాలు జరిగితే జగన్ ఏం చేశారు.. గత ఐదేళ్లలో మిస్సయిన 30 వేల మంది మహిళల గురించి జగన్ ఏం సమాధానం చెబుతారు అని ప్రశ్నించారు. మహిళలను బూతులు తిడుతుంటే ఆనందించే మొదటి వ్యక్తి జగనేనని వాసిరెడ్డి పద్మ చెప్పిన దానికి జగన్ ఏం సమాధానం చెబుతారు.. కాబట్టి జగన్ ఇకనైనా తన తీరు మార్చుకోవాలి అని పంచుమర్తి అనురాధ అన్నారు.