బెజ‌వాడ వార్త : థాంక్ యూ ఆధార్.. డ్రగ్ కేసులో కీలక మలుపు

-

ఎంత ప్రయత్నిస్తున్నా మాదక ద్రవ్యాల రవాణాను నిలువరించలేకపోవడం ఓ విధంగా వ్యవస్థ వైఫల్యం. యువత పెడదోవ పడుతున్న కారణంగా ఎప్పటి కప్పుడు పోలీసులకు కొత్త సవాళ్లు ఎదరువుతూనే ఉన్నాయి. ఆ కారణంగా కొందరు పోలీసులు విధి నిర్వహణలో తీవ్ర ఒత్తిళ్లను చవి చూస్తున్నారు. గతంలో ఉన్నతాధికారులకు కూడా ఇవే పెను వివాదాలు తీసుకువచ్చాయి.

బెజవాడ అన్నది డ్రగ్ సిటీ గా మారిపోతుందని విపక్ష టీడీపీ అనేక సార్లు ఆందోళనలు వ్యక్తం చేసింది. అదేవిధంగా యువత కూడా ఎటువంటి పెడదోవలు పట్టకుండా, ఆదాయ వనరులు బాగున్నాయి వీటి రవాణాకు సహకరించకుండా తగు జాగ్రత్తల్లో ఉండాలని ఎన్నో సార్లు పోలీసులు కౌన్సిలింగ్ సెషన్స్ కూడా పోలీసులు నిర్వహించారు.

అయినా కూడా కొరియర్ సర్వీస్ ద్వారా హాయిగా విదేశం నుంచి ఇటుగా రావడం వీటిని నిలువరించే క్రమంలో మూలాలు ఎక్కడున్నాయి అన్నది తెలుసుకోలేకపోవడం అన్నవి తరుచూ జరుగుతున్న పొరపాట్లు. వీటిని నివారించేందుకు పోలీసులు తీసుకుంటున్న చర్యలు మరింత వేగం అయి కొన్నంటే కొన్ని సత్ఫలితాలు ఇస్తున్నాయి. తాజాగా అలాంటి ఘటన ఒకటి వెలుగులోకి రావడంతో ఏపీ పోలీసు బృందాలను వీటితో పాటు పనిచేసిన బెంగళూరు కస్టమ్స్ అధికారులను పలువురు ఉన్నతాధికారులు ప్రశంసిస్తున్నారు. ఆ వివరం ఈ కథనంలో..

ఆధార్ కార్డ్ అన్నది ఒకప్పుడు ఎన్నో విమర్శలు ఎదుర్కొంది. ఆ రోజు నందన్ నిలేకని అనే నిపుణుడి ఆలోచన ఏ పాటి కొద్ది మందికో తప్ప ఇంకెవ్వరికీ అర్థం కాలేదు. ఆధార్ నంబర్ ఆధారంగా ఇవాళ కొన్ని కేసులను పోలీసులు ట్రేస్ చేయగలుగుతున్నారు. తప్పుడు ఆధార్ గుట్టు కూడా ఎప్పటికప్పుడు తేల్చగలుగుతున్నారు. ముఖ్యంగా ఆధార్ కార్డ్ కారణంగానే సంబంధిత నంబర్ పట్టుకుని పోలీసులు కేసులను ట్రేస్ చేయడం కూడా చేయగలుగుతున్నారు.

మొదట్లో ఉన్న విమర్శలు తొలగి, పుట్టిన బిడ్డలకూ ఇవాళ ఆధార్ ఎంతగానో ఆధారం అయింది అంటే అందుకు కారణంగా ఇందులో ఉన్న సాంకేతికతే ! ఇదే సాంకేతిక విజ్ఞానం బెజవాడ పోలీసులకు ( ఇంకా చెప్పాలంటే విజయ సెంట్రల్ ఏసీపీ వర్గాలకు ) ఎంతగానో సాయం చేసింది. ఎప్పటి నుంచో అపరిష్కృతంగా ఉన్న ఓ డ్రగ్ కేసు వివరంను పట్టి ఇచ్చి ప్రధాన నిందితుడ్ని పట్టి ఇచ్చింది. ఆ విధంగా మేరా ఆధార్ మహాన్ అనే విధంగా చేసింది. ఆ వివరం ఈ కథనంలో…

సంచలంన రేపిన బెజవాడ డ్రగ్స్ కేసులో ఓ చిన్న తప్పిదం కారణంగా గుట్టు మొత్తం వెలుగులోకి వచ్చింది. దీంతో సమస్య మూలాలు ఎక్కడన్నవి తేలిపోయింది. ఇంత కాలం కేసు ఛేందించేందుకు నానా అవస్థలూ పడిన పోలీసు అధికారులకు తాజా పరిణామం ఊపిరి పీల్చుకునేలా చేసింది. గత కొంత కాలం విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు తెర దించేవిధంగా సంబంధిత అననుకూల వాతావరణం తెరిపిచ్చేలా చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

అతడి పేరు సాయి గోపి. గుంటూరు జిల్లా, సత్తెనపల్లి మండలం, లక్కరాజు గార్లపాడు ఆయన స్వస్థలం. ఓ రోజు విజయవాడ ., భారతీ నగర్లో ఉన్న డీఎస్టీ కొరియర్ సెంటర్ కు వచ్చి పచ్చళ్లు, ఇతర వస్తువులతో కూడిన పార్సిళ్లను ఆస్ట్రేలియా కు పంపాలని కోరాడు. దీంతో అతడు తన గుట్టు రట్టు కాకుండా ఉండేందుకు కొన్ని మాదక ద్రవ్యాలు కూడా అందులోనే ఉంచాడు. అత్యంత తెలివిగా పార్సిల్ బుక్ చేసేటప్పుడు తన ఆధార్ నంబర్ ఇవ్వకుండా అక్కడ కొరియర్ సెంటర్లో పనిచేస్తున్న కుర్రాడు గుత్తుల తేజ నంబర్ ఎంటర్ చేయించి తన పని అయిందని అనిపించుకున్నాడు.

కానీ ఆ పార్శిల్ ఆస్ట్రేలియాకు కాకుండా పొరపాటున కెనడాకు చేరింది. తప్పుడు చిరునామా కావడంతో కెనడా నుంచి బెంగళూరుకు తిరిగి చేరుకుంది. అక్కడ పాయింట్ దగ్గర పోలీసులు అనుమానం వచ్చి చెక్ చేయగా, అసలు గుట్టు రట్టయింది. పార్శిల్ వాస్తవానికి నేరుగా విజయవాడకు చేరుకోవాల్సి ఉన్న మధ్యలో తనిఖీల కారణంగా బెంగళూరులో నిలిచిపోయింది.

సంస్థ ఆదేశాల మేరకు పార్శిల్ రాక ఆలస్యం కావడంతో బెంగళూరుకు చేరుకున్న తేజను పోలీసులు (కస్టమ్స్ విభాగం) అరెస్టు చేశారు. దీంతో విషయాన్ని విజయవాడలో ఉంటున్న తన బావకు తెలియజేశాడు. మొత్తానికి పోలీసులు రంగంలో దిగి ప్రధాన నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఇంతటి తగాదాకు ఆధార్ కార్డే కారణం అయింది. బుకింగ్ లో ప్రధాన నిందితుడు కాకుండా కొరియర్ బోయ్ ఆధార్ ఇవ్వడంతోనే మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చి నిజాలు అన్నవి ఏంటన్నది తేలింది.

Read more RELATED
Recommended to you

Latest news