ఏపీలో ఆంజనేయ స్వామి ఆలయం ధ్వంసం.. సీఎం చంద్రబాబు సీరియస్

-

సికింద్రాబాద్ లో ముత్యాలమ్మ తల్లి విగ్రహాన్ని కాలితో తన్నుతూ ధ్వంసం చేసిన సంఘటన మరువక ముందే.. మరో దారుణంలో జరిగింది. అయితే.. ఈసారి తెలంగాణ లో కాకుండా ఆంధ్ర ప్రదేశ్‌ లో దేవాలయంపై దాడి జరిగింది. మరో హిందూ దేవాలయం ధ్వంసం అయింది.. వరుస ఘటనలతో అల్లకల్లోలం అవుతున్నాయి తెలుగు రాష్ట్రాలు.

Thugs who destroyed Anjaneya Swamy temple

అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం మొలకలచెరువు మండలం కదిరినాథుని కోట సమీపంలోని అభయాంజనేయ స్వామి ఆలయాన్ని ధ్వంసం చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు స్థానిక ఆర్ఎస్ఎస్, బీజేపీ, వీహెచ్ పీ నేతలు. ఇక ఈ ఘటనపై స్పందించి వెంటనే నిందితులను అరెస్టు చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు. దాడి చేసినవారిని అరెస్టు చేయాలని పోలీసులను ఆదేశించిన సీఎం చంద్రబాబు.. దాడికి పాల్పడినవారిని కఠినంగా శిక్షించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version