తిరుమల భక్తులకు అలర్ట్.. ఇవాళ్టి నుంచి నెల రోజుల పాటు హోమాలు ఉండనున్నాయి. తిరుపతిలో కార్తీక మాసం సందర్భంగా కపిలేశ్వర స్వామి ఆలయంలో నెల రోజులు పాటు హోమాలు ఉంటాయి. ఇవాళ్టి నుంచి డిసెంబర్ 1వ తేది వరకు నిత్యం హోమాలు నిర్వహించనున్నారు అర్చకులు. నేటి నుంచి 4వ తేది వరకు గణపతి హోమం ఉంటుంది.
5 వ తేది నుంచి 7వ తేది వరకు సుబ్రమణ్యస్వామి హోమం నిర్వహిస్తారు. 8వ తేదిన దక్షిణామూర్తి హోమం. 9వ తేదిన నవగ్రహ హోమం ఉంటుంది. 10వ తేది నుంచి 18వ తేది వరకు చండి యాగం నిర్వహిస్తారు. 19వ తేది నుంచి 29వ తేది వరకు రుద్రయాగం ఉంటుంది. 30వ తేదిన కాలబైరవస్వామి హోమం, డిసెంబర్ 1వ తేదిన చండికేశ్వరస్వామి హోమం ఉంటుంది. ఇక అటు టీటీడీ పాలక మండలి సభ్యుల పేర్లలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ మేరకు తాజాగా టీటీడీ పాలక మండలిని అధికారికంగా ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. చైర్మన్‌గా బొల్లినేని రాజగోపాల్ నాయుడు, సభ్యులుగా మరో 24 మంది ఉంటారని.. ఓ లిస్ట్ ను అధికారికంగా ప్రకటించింది ఏపీ ప్రభుత్వం.