తిరుపతిలో చిరుత సంచారం కలకలం రేపింది. తిరుపతి వేదిక్ యూనివర్సిటీ ఆవరణలో చిరుత సంచారం కలకలం రేపింది. గత కొన్ని రోజులుగా రాత్రి సమయాల్లో సంచరిస్తోంది చిరుత. ప్రధాన రోడ్ల వెంబడి తిరుగుతుండటాన్ని గుర్తించారు తిరుపతి వేదిక్ విద్యార్థులు. అనంతరం అధికారులకు సమాచారం ఇచ్చారు.
దీంతో చిరుత బంధించేందుకు అటవీశాఖ, టీటీడీ, పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. అటు చిరుత సంచరిస్తున్న నేపథ్యంలో భయబ్రాంతులకు గురవుతున్నారు విద్యార్థులు. అటు తిరుపతి వేదిక్ యూనివర్సిటీ ఆవరణలో చిరుత సంచారం కలకలం రేపిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. తిరుపతి ఎస్వీ వేదవిశ్వ విద్యాలయం లో చిరుతపులి సంచరించినట్లు అటవీశాఖ అధికారులు గుర్తించిన తరుణంలో విద్యార్థులు, ఉద్యోగులకు కీలక సూచనలు చేశారు. చిరుతపులి సంచారంతో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని, రాత్రి పూట జాగ్రత్త వహించాలని సూచించారు అధికారులు.