తిరుపతిలో వ్యక్తిని కాలితో తన్నిన పోలీస్… వీడియో వైరల్ కావడంతో సస్పెండ్

-

తిరుపతిలో అన్నమయ్య సర్కిల్ లో శనివారం ఓ వ్యక్తిని పోలీస్ కాలితో తన్నాడు. సదరు వ్యక్తి పడుతున్నా వదలకుండా కాలితో తన్నిన వీడియో వైరల్ అయింది. దీంతో ఈ ఘటనపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. తను ఉద్దేశపూర్వకంగా తన్నలేదని సదరు హెడ్ కానిస్టేబుల్ చెప్పే ప్రయత్నం చేశారు. అయితే వీడియో తెగ వైరల్ కావడం నెటిజెన్ల నుంచి వ్యతిరేఖత రావడంతో కానిస్టేబుల్ ను సస్పెండ్ చేశారు అధికారులు.

అయితే ఈ ఘటనలపై తిరుపతి డీఎస్పీ కాటం రాజు మాట్లాడుతూ… మద్యం మత్తులో ఉన్న వ్యక్తికి, ఏపీఎస్ ఆర్టీసీ డ్రైవర్ తో గొడవ జరిగిందని, మద్యం మత్తులో ఉన్న వ్యక్తిని బస్సులో ఎక్కించుకోవడానికి అనుమతించకపోవడంతోనే గొడవ జరిగినట్లు ఆయన వెల్లడించారు. ఇదే సమయంలో ఈ గొడవ గురించి తెలుసుకున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ విషయాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నించాడని.. అయితే మద్యం మత్తులో ఉన్న వ్యక్తి అసభ్య పదజాలంతో దూషించడంతో కానిస్టేబుల్ ఇలా చేశాడని వెల్లడించారు.

 

 

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version