త్వరలోనే ఆ పార్టీలో చేరుతున్నా అని, త్వరలోనే దానిపై క్లారిటీ ఇస్తానని పేర్కొన్నారు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు. ఇవాళ వైసీపీ పార్టీ కి రాజీనామా చేశారు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు. ఈ సందర్బంగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు మాట్లాడుతూ… జగన్ చుట్టూ ఉన్న కోటరి నన్ను క్షోభ కి గురి చేశారని మండిపడ్డారు.
ఎన్నికల సమయంలో సాధారణ కార్యకర్తగానే నేను పనిచేశాను, కనీసం నన్ను పరిగణనలోకి తీసుకోలేదన్నారు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు. వంగా గీత నన్ను,నా కుటుంబాన్ని ఎన్నో ఇబ్బందులకు గురి చేశారని చెప్పారు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు. కూటమి లో ఉన్న ఒక పార్టీ లో త్వరలో చేరుతాను.
వర్మ తో నాకు వ్యక్తిగత విభేదాలు లేవు అని చెప్పారు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు. పెత్తనం చేయడానికి వెళ్లడం లేదు సలహాలు మాత్రమే ఇస్తాను… ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం లేదని పేర్కొన్నారు. అనుచరులు కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటాను అంటూ వెల్లడించారు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు.