తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. తిరుమలో 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. ఈ నేపథ్యంలోనే టోకేన్ లేని భక్తులు సర్వదర్శనానికి 14 గంటల సమయం పట్టనుంది. నిన్న 71, 946 మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. 30294 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక హుండి ఆదాయం 4.51 కోట్లుగా నమోదు అయింది.
కాగా, తిరుమలలో 17వ తేదిన శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు అంతురార్పణ చేయనుంది టీటీడీ పాలక మండలి. 18వ తేదిన ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. తొమ్మిది రోజులు పాటు 16 వాహనాలపై మాడ వీధులలో విహరిస్తూ భక్తులుకు దర్శనం ఇవ్వనున్నారు మలయప్పస్వామి. ఇక ఈ నెల 26వ తేదీ ధ్వజాఅవరోహణంతో ముగియనున్నాయి తిరుమల బ్రహ్మోత్సవాలు.