హలో లోకేష్ ! రజనీని చూసి నేర్చుకోవయ్యా !

-

తెలుగుదేశం పార్టీ పగ్గాలు ఇప్పుడు కాకపోయినా మరికొంత కాలానికి అయినా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ స్వీకరించి తీరుతాడు. అయితే ప్రస్తుతానికిి టిడిపి నాయకుల్లో లోకేష్ పనితీరుపై ఎవరికి నమ్మకం లేదు. లోకేష్ కు కనుక బాధ్యతలను అప్పగిస్తే , పార్టీని పాతాళంలోకి నెట్టేస్తారు అనే విషయం చంద్రబాబుకు తెలియంది కాదు. అందుకే ఆయనను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిలోనే ఉంచుతూ,  ఏపీ టీడీపీ అధ్యక్షుడు  బాధ్యతలను అచ్చన్న కు అప్పగించారు. అయితే అచ్చన్న  తనను ఎక్కడ డామినేట్ చేస్తాడో అని భయం లోకేష్ కు ఉంది. అయినా, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు ప్రయత్నిస్తున్నారు. కొద్దిరోజుల క్రితమే తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ రూరల్ నియోజకవర్గంలో లోకేష్ పర్యటించారు. ఈ సందర్భంగా పంట నష్టపోయిన రైతులను పరామర్శించిన వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు పై విమర్శలు చేశారు.

అదేవిధంగా పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో లోకేష్ పర్యటించారు ఈ సందర్భంగా వరద ముంపు ప్రాంతాలను సందర్శించే నిమిత్తం ఏర్పాటు చేసిన ట్రాక్టర్ ను లోకేష్ నడిపారు. ఆ ట్రాక్టర్ లో పార్టీకి సంబంధించిన వారంతా ఎక్కారు. అయితే ఆ ట్రాక్టర్ ను నడిపించే క్రమంలో తడబాటుకు గురైన లోకేష్ దాన్ని నేరుగా కాలువలోకి దింపడం , వెంటనే పక్కనే ఉన్న ఉండి ఎమ్మెల్యే రామరాజు ట్రాక్టర్ ను అదుపులోకి తెచ్చి ప్రమాదం జరగకుండా అపడం వెంట వెంటనే జరిగిపోయాయి. లేకపోతే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది. ఇక అప్పటి నుంచి లోకేష్ ను టార్గెట్ చేసుకుంటూ రావడం,  మళ్లీ ఆయన రాజకీయ ప్రత్యర్థుల తో పాటు, సోషల్ మీడియాలోనూ సెటైర్లు వేస్తున్నారు. ట్రాక్టర్ ను నడిపించడం చేతకాని లోకేష్ పార్టీని ఏ విధంగా నడిపిస్తారని, ట్రాక్టర్ స్టీరింగ్ కంట్రోల్ చేయలేక అందులోని జనాలను ప్రమాదానికి గురి చేయబోయిన లోకేష్ టిడిపిని అదేవిధంగా ప్రమాదంలోకి నెట్టేస్తారు అంటూ పెద్ద ఎత్తున కామెంట్స్ వస్తూనే ఉన్నాయి.
ఇవి ఇలా వుండగానే,  గుంటూరు జిల్లా చిలకలూరిపేట వైసిపి ఎమ్మెల్యే విడుదల రజిని , తన నియోజకవర్గంలో వ్యవసాయానికి సంబంధించి ప్రభుత్వం చేస్తున్న సహాయం పై అవగాహన కల్పించేందుకు ఆమె స్వయంగా ట్రాక్టర్ నడిపించి హడావుడి చేశారు. ఆమె చాలా ధైర్యం గా ట్రాక్టర్ నడపడం, సోషల్ మీడియాలో బాగా హైలెట్ అవుతోంది. దీంతో విడుదల రజిని చూసి లోకేష్ చాలా నేర్చుకోవాలి అంటూ, మొన్నటి ప్రమాద ఘటనను ఇప్పుడు విడదల రజిని ఘటనకు ముడి వేస్తూ, లోకేష్ ను ఒక ఆట     ఆడుకుంటున్నారు. అయ్యో చిన్న బాబు నీకు ఎంత కష్టం వచ్చింది అంటూ వేటకారపు సానుభూతిని వ్యక్తం చేస్తూ లోకేష్ పరువు బజారున పడేస్తున్నారు.
-Surya

Read more RELATED
Recommended to you

Latest news