ఆంధ్రప్రదేశ్ డీజీపీకి పదే పదే లేఖలు రాస్తే అధికారం రాదు, చంద్రబాబు గారూ…డీజీపీకి లేఖలు రాసి, ఏం పికుతావు అని చురకలు అంటించారు విజయసాయి రెడ్డి. ఆంధ్రప్రదేశ్ లో ‘అరాజకాలు’ జరుగుతున్నాయంటూ పదే పదే రాష్ట్ర పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ (డీజీపీ)కి లేఖలు రాయడం తెలుగుదేశం అధినేత ఎన్.చంద్రబాబు నాయుడుకు అలవాటుగా మారిపోయింది. రాష్ట్ర శాసనసభ ఎన్నికలు ఏడాదిన్నర లోపే జరగనున్న నేపథ్యంలో టీడీపీ రాజకీయ వేడిని పెంచుతోందన్నారు.
రాజకీయ విద్వేషాలను రాజేస్తోంది. ఈ క్రమంలో పాలక, ప్రతిపక్షాల కార్యకర్తలు, నాయకుల మధ్య జరుగుతున్న గొడవలను గోరంతలు కొండంతలు చేస్తున్నారు చంద్రబాబు. ఈ కీచులాటలను సాకుగా చూపించి ఏపీలో ప్రతిపక్షాలపై విపరీతంగా దాడులు జరుగుతున్నట్టు ఆయన ప్రచారం చేస్తున్నారు. ఈ విష ప్రచారానికి మీడియాలో చోటు కల్పించడం కోసం ఆయన క్రమం తప్పకుండా చిన్న చిన్న రాజకీయ గొడవలపై సైతం రాష్ట్ర డీజీపీకి లేఖలు రాస్తున్నారు. శాంతి, భద్రతలు లోపించాయని ‘నిరూపించడానికి’, ప్రచారం చేయడానికి కొన్ని జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలను మాజీ ముఖ్యమంత్రి ఎంపిక చేసుకున్నారన్నారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లా కుప్పం, పుంగనూరు, మాచర్ల జిల్లా, అనంతపురం జిల్లాలోని కొన్ని ప్రాంతాలను ఎంపిక చేసుకుని అక్కడి సాధారణ ఘటనలపై సైతం ఆయన రాష్ట్ర డీజీపీకి రాసే లేఖల్లో అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారు. టీడీపీ అధికారంలో, తాను ముఖ్యమంత్రి పీఠంపై లేని కారణంగా ఏపీలో అంతా అరాజకమే తాండవిస్తున్నట్టు బాహ్య ప్రపంచానికి చెప్పడమే చంద్రబాబు గారి ఉద్దేశం. అందుకే, పోలీసు ఉన్నతాధికారికి ఈ లేఖాయణం. డీజీపీకి, కేంద్ర ప్రభుత్వానికి నిరాధార ఆరోపణలతో ఫిర్యాదులు చేసినంత మాత్రాన ఆంధ్రా ప్రజలు నమ్మరు. అబద్ధాలతో అధికారం సంపాదించడం అసాధ్యం అని తెలిపారు విజయసాయి రెడ్డి.