రైలు ప్రమాదంపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్ పెట్టాడు. ఒడిశాలో శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాదంపై అంతర్జాతీయ మీడియా దృష్టి సారించింది. 21వ శతాబ్దంలో జరిగిన ఈ అతి పెద్ద రైలు దుర్ఘటన వివరాలు ఇస్తూనే భారత రైల్వేల చరిత్రను, దాని విశిష్ఠతను ఈ ప్రపంచ వార్తాసంస్థలు అందరికీ తెలియజేస్తున్నాయి. బ్రిటిష్ వారి పాలనలోని భారతదేశంలో 1853లో అంటే 170 ఏళ్ల క్రితం ప్రవేశపెట్టిన భారత రైల్వే వ్యవస్థ శరవేగంతో అభివృద్ధి సాధించిందని వివరించారు.
దేశంలో ప్రయాణికులను వారి గమ్యాలకు చేర్చడమేగాక, ఇతర సాంప్రదాయ సరకు రవాణా పద్ధతులతో పోల్చితే రైల్వేలు అంతే సామర్ధ్యంతో, ఇంకాస్త చౌకగా వస్తు రవాణా చేయడం ద్వారా భారత ప్రగతిలో కీలకపాత్ర పోషిస్తోంది. 1991 నుంచీ దేశ ఆర్థికవ్యవస్థతో పాటే రోడ్డు మార్గాలు విపరీతంగా విస్తరించినా గాని పెరుగుతున్న వాణిజ్య అవసరాలకు అనుగుణంగా భారత రైల్వేలు వృద్ధిచెందాయేగాని వెనుకబడ లేదని వెల్లడించారు.
భారతదేశంలో నలుమూలలకూ విస్తరించిన భారత రైల్వేల రైలు పట్టాల వ్యవస్థ మ్తొత్తం విస్తీర్ణం 2022 మార్చి 31 నాటికి 1,28,305 కిలోమీటర్లు కాగా, రైళ్లు నడిచే పట్టాల (రైలు ట్రాక్) పొడవు 1,02,831 కి.మీ. అందులో అన్ని రైలు మార్గాల రూట్లు కలిపి చూస్తే వాటి మొత్తం పొడవు 68,043 కి.మీ. 1853లో మొదలైన భారత రైల్యేల ప్రయాణం వేగంగా ముందుకు సాగడంతో 1880 నాటికి 9000 మైళ్ల పొడవైన రైలు మార్గాల స్థాయికి చేరిందన్నారు విజయసాయిరెడ్డి.