ప్రతీ అపార్టుమెంట్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి : విశాఖ కమిషనర్ రవిశంకర్ అయ్యనార్

-

ప్రతీ అపార్టుమెంట్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి అని విశాఖ కమిషనర్ రవిశంకర్ అయ్యనార్ సూచించారు. తాజాగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీసీ  ఫుటేజి ప్రతి అపార్ట్మెంట్, కమర్షియల్ కాంప్లెక్స్ లలో ఏర్పాటు చేయాలన్నారు. సైబర్ క్రైమ్స్ లో కోట్లలో నష్టపోతున్నారు. భూకబ్జా ఉదంతాలను చాలా మంది మా దృష్టికి తీసుకువస్తున్నారు. ఒంటరి మహిళను లక్ష్యంగా చేసుకుని దోపిడీలు జరుగుతున్నాయి. నేరాల్లో కొంత మంది అధికారులు, భూకబ్జాదారులు ఉన్నారు.

ఈనెల 6వ తేదీన భూకబ్జాలపై నగర పరిధీలో ఉన్న పోలీస్ స్టేషన్ లలో ప్రత్యేక స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. తప్పుడు దృవపత్రాలతో ఒక ముఠాగా ఏర్పడి నేరాలకు పాల్పపడుతున్నారు. అలాంటి వారిపై కేసులు నమోదు చేసి చట్టపరంగా శిక్షిస్తామని తెలిపారు. పరదేశిపాలెంలో ఒక కంటైనర్ ను స్వాధీనం చేసుకున్నాం.కంటైనర్ లో గంజాయి ఉన్నట్లు తెలుస్తోంది. పీఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఫోటోగ్రాఫర్ సాయి అదృశ్యంపై29 న ఫిర్యాదు వచ్చింది. అతని వద్ద ఉన్న పది లక్షల ఖరీదు చేసే కెమేరా కోసం హత్యచేశారు. ఆలమూరు వద్ద అతని మృతదేహాన్ని గుర్తించారు. ఇద్దరూ నిందితులను అరెస్ట్ చేసినట్టు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version