కొల్లేరుకు బుడమేరు వరద ఉధృతి భారీగా పెరిగింది. నిన్నటి కంటే రెండు అడుగుల మేర కొల్లేరు నీటి మట్టం ఎక్కువైంది అని అధికారులు చెబుతున్నారు. దీంతో 15 గ్రామాలకు రాకపోకలకు స్తంభించిన పరిస్థితి ఏర్పడింది. కేవలం బోటు ద్వారానే కొల్లేరు లంక గ్రామాల నుంచి బయటకు వస్తున్నారు పిల్లలు, వృద్ధులు. ఏలూరు – కైకలూరు రోడ్డుపై నుండి బుడమేరు వరద నీరు వెళ్తుంది. అయితే ఇంకా కొల్లెరుకు వరద ఉదృతి పెరుగుతుందనే నేపథ్యంలో ఆందోళనలో ఉన్నాయి కొల్లేరు లంక గ్రామాలు.
ఇక ఏలూరు కైకలూరు మధ్య రాకపోకలు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే కైకలూరు నుంచి ఏలూరు, ఏలూరు నుంచి కైకలూరు వెళ్లాల్సిన వారు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని పోలీసులు సూచుస్తున్నారు. చిన్నఆడ్లగడ వద్ద రహదారి పై నాలుగు అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తుండడంతో భారీ వాహనాలకు మాత్రమే అక్కడి నుండి వెళ్లేందుకు అనుమతి ఇస్తున్నారు పోలీసులు.