నువ్వు రాజకీయాల్లో అద్భుతాలు సృష్టించగలవు..పవన్‌కు చిరంజీవి బర్త్ డే విషెస్..!

-

కొణిదెల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఏపీ డిప్యూటీ సీఎం పుట్టిన రోజు సందర్బంగా ఆయనకు శుభాకాంక్షల వెల్లువ కురుస్తోంది. 1968 సెప్టెంబర్ 2 జన్మించిన పవన్ కళ్యాణ్ సినీ ప్రస్థానంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు.సినిమాల్లో ఆయనకు హిట్స్ ఎక్కువగా లేకపోయినా అభిమానులు మాత్రం తగ్గలేదు. పవన్ సినిమా ఎప్పుడు వచ్చింది కాదు.. వచ్చిందా? లేదా అనేది తమకు ముఖ్యమంటూ జనసేనాని ఫ్యాన్స్ చెప్పుకుంటుంటారు. ఒక్కసారి పవన్ బరిలోకి దిగితే సినిమా హిట్టా? ఫట్టా సంబంధం లేదని బాక్సాఫీస్ బద్దలు కావాల్సిందేనని ఫ్యాన్స్ అంటున్నారు.

 

ఇక తన తమ్ముడు పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సోమవారం ప్రత్యేకమైన పోస్టు పెట్టారు.‘ఏటా పుట్టిన రోజు వస్తుంది. కానీ, ఈసారి ప్రత్యేకం.రాజకీయాల్లో నీతి, నిజాయితీ, నిలకడ, నిబద్ధత కలిగిన వ్యక్తిగా ప్రజలు నిన్ను వాళ్ల జీవితాల్లోకి ఆహ్వానించారు. ఈ రోజుల్లో నీలాంటి నాయకుడు కావాలి. రావాలి. అద్భుతాలు జరగాలి. అది నువ్వు మాత్రమే చేయగలవు. చేస్తావనే నమ్మకం నాతో పాటు ఏపీ ప్రజలకు ఉంది.దీర్ఘాయుష్మాన్ భవ! అని ట్వీట్ చేశారు. మరోవైపు మెగాపవర్ స్టార్ రాంచరణ్ కూడా ‘మా పవర్ స్టార్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version