మీ చేతగానితనం లక్షల మంది ప్రజలకు శాపంగా మారకూడదు – చంద్రబాబు

-

ప్రభుత్వం వెంటనే ఎయిమ్స్ కు అవసరమైన అన్ని అదనపు మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు నారా చంద్రబాబు నాయుడు. మీ చేతగానితనం లక్షల మంది ప్రజలకు శాపంగా మారకూడదని మండిపడ్డారు.

“రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన మంగళగిరి ఎయిమ్స్ (AIIMS) కు కనీసం నీటి సరఫరా చెయ్యలేని ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి? అతి తక్కువ ధరలో పేదలకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందించే ఆసుపత్రికి నీళ్లివ్వలేనందుకు ప్రభుత్వం సిగ్గు పడాలి. అసలు వైసీపీ ప్రభుత్వం ఈ మూడున్నరేళ్ల కాలంలో ఎయిమ్స్ కోసం ఏం చేసిందో చెప్పగలదా?నాడు తెలుగుదేశం హయాంలో ఎయిమ్స్ కు భూములు ఇచ్చి, వసతులు కల్పించి వైద్య సేవలకు ఈ ప్రతిష్టాత్మక సంస్థను సిద్దం చేశాం. అటువంటి సంస్థ పెరిగిన తమ అవసరాల కోసం అదనంగా నీటి వనరులను సమాకూర్చాలని లేఖలు రాసినా పరిష్కరించకపోవడం ఈ ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం.

రాష్ట్రంలో మెడికల్ కాలేజ్ లు అన్నీ తామే తెచ్చామని అసెంబ్లీలో సైతం అసత్యాలు చెప్పుకున్న ముఖ్యమంత్రి …తానుంటున్న మునిసిపాలిటీ నుంచి ఆసుపత్రికి నీళ్లెందుకు ఇవ్వలేకపోతున్నారు?స్వయంగా కేంద్ర మంత్రులు సైతం నీటి వసతి పై ప్రభుత్వాన్ని ప్రశ్నించినా స్పందించని ఈ ముఖ్యమంత్రి… వైద్య రంగంలో సమూల మార్పులు తన వల్లే అని బొంకుతున్నాడు. మీ చేతగానితనం లక్షల మంది ప్రజలకు శాపంగా మారకూడదు. ప్రభుత్వం వెంటనే ఎయిమ్స్ కు అవసరమైన అన్ని అదనపు మౌలిక సదుపాయాలు కల్పించాలి”. అని డిమాండ్ చేశారు.
https://twitter.com/ncbn/status/1574331176873250818?s=20&t=vKBaA6nT9cPX4dAAiubL2w

Read more RELATED
Recommended to you

Latest news