గత కొన్ని రోజుల నుండి ఆంధ్రప్రదేశ్ లో అంగన్వాడీ లతో ప్రభుత్వం చర్యలు జరుపుతూ ఉంది. అంగన్వాడీ సిబ్బంది సమ్మె చేస్తున్నారు. ఏపీ సర్కారు ఒకపక్క వాలంటీర్లతో అంగన్వాడీ సెంటర్లు తెరిపిస్తూ ఇంకోపక్క అంగన్వాడీ సిబ్బందితో చర్యలు చేస్తోంది అంగన్వాడిల చాలా అంశాలని పరిగణలోకి తీసుకుంటామని మంత్రివర్గ ఉప సంఘం చెప్పింది కూడా. అన్నిటికీ సరేనని చెప్పిన మంత్రివర్గ ఉప సంఘం వేతనాల పెంపు పై మాత్రం వెనక్కి తగ్గుతోంది.
జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలతో పాటు సుప్రీంకోర్టు సూచించినట్లు జీతాలని పెంచాలని కోరుతున్నారు. అయితే ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ఉపయోగించడం పై అంగన్వాడీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తపరుస్తున్నాయి. తమని అదిరించి బెదిరించి ఉద్యమాన్ని ఆపలేరని అన్నాయి. కనీస వేతనం 26,000 ఇచ్చి తీరాలని, అప్పటి దాకా సమ్మె చేసి తీరతాం అన్నాయి అంగన్వాడీలు. అలానే, అందాల్సిన హక్కుల్ని కూడా ప్రభుత్వం పట్టించుకోవాలని అంటున్నారు అంగన్వాడీ మహిళలు. హక్కుల సాధన కోసం ఎంతవరకైనా పోరాడుతామని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు అమలు చేసే దాకా సమ్మె ఆపం అంటున్నారు.