గాంధీజీ నేతాజీ మధ్య సత్సంబంధాలు లేవు…బాంబు పేల్చిన నేతాజీ కుమార్తె…!

-

గాంధీజీ నేతాజీ మధ్య సత్సంబంధాలు లేవంటూ నేతాజీ కూతురు అనితా బోస్ వ్యాఖ్యానించారు. కానీ తన తండ్రి నేతాజీ కి గాంధీజీ అంటే ఎంతో అభిమానం అని చెప్పారు. రీసెంట్ గా ఇండియా టుడే కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనితా బోస్ ఈ కామెంట్లు చేశారు. అంతే కాకుండా నెహ్రూ, గాంధీజీ లే నేతాజీని బ్రిటిషర్లకు అప్పగించారు అన్న వ్యాఖ్యలపై అనితా స్పందించారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన ఇద్దరూ కూడా హీరోలే అని అనితా బోస్  అన్నారు.

Netaji-Subhash-Chandra-Bose

ఆ ఇద్దరిలో ఏ ఒక్కరూ లేకపోయినా స్వాతంత్య్రం వచ్చేది కాదని అనితా బోస్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేతలు ఎప్పటి నుండో చెబుతున్నట్లుగా కేవలం అహింసా విధానాల వల్లే స్వాతంత్య్రం రాలేదని అన్నారు. నేతాజీ ఇండియన్ ఆర్మీ చర్యలు కూడా స్వాతంత్రానికి కారణమని అనితా బోస్ స్పష్టం చేశారు. అలాగని నేతాజీ వల్లనే స్వాతంత్ర్యం వచ్చింది అనడం కూడా కరెక్ట్ కాదు అని అన్నారు. తన తండ్రి సహా గాంధీజీ ఎంతోమందికి స్ఫూర్తిని ఇచ్చారని వ్యాఖ్యానించారు. అంతే కాకుండా స్వాతంత్ర్యం పై ఏకపక్ష ప్రకటనలు చేయడం తెలివి తక్కువ తనం అంటూ కంగానా చేసిన వ్యాఖ్యలకు పరోక్షంగా అనితా బోస్ చురకలు అంటంచారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version