బాలకృష్ణ, నేను మంచి ఫ్రెండ్స్: హీరోయిన్ అంజలి

-

బాలకృష్ణ వివాదంపై హీరోయిన్ అంజలి తాజాగా స్పందించారు. నందమూరి బాలకృష్ణ అలాగే నేను చాలా ఏళ్లుగా మంచి స్నేహితులమని… టాలీవుడ్ హీరోయిన్ అంజలి తెలిపారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా వచ్చినందుకు నందమూరి బాలయ్య కు కృతజ్ఞతలు చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు హీరోయిన్ అంజలి.

బాలకృష్ణ గారికి అలాగే నాకు ఒకరి పట్ల ఒకరికి పరస్పర రెస్పెక్ట్ ఉందన్నారు. ఆయనతో మళ్ళీ వేదిక పంచుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు హీరోయిన్ అంజలి. ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో అంజలిని బాలకృష్ణ నెట్టు వేయడంపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నందమూరి బాలకృష్ణ చేసిన ఒక పనితో అందరికీ షాకిచ్చాడు. తన పక్కనే ఉన్న హీరోయిన్ అంజలిని ఒకేసారి పక్కకి నెట్టేశారు. ఆ వెంటనే బాలయ్య మళ్లీ అంజలితో ఏదో మాట్లాడి ఓ హైఫై ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version