స్ట్రాటజీ మార్చేస్తున్న రాజుగారు.. మళ్ళీ కొత్త ట్విస్ట్?

-

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు రోజుకో ట్విస్ట్ ఇస్తున్నారు. అసలు ఎప్పుడైతే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని అన్నారో అప్పటినుంచి ఊహించని ట్విస్ట్‌లు తెరపైకి వస్తున్నాయి. వైసీపీ నుంచి గెలిచి ఇంతకాలం అదే పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చారు. అయితే తమపై విమర్శలు చేస్తున్న రాజుగారిపై వేటు వేయించడానికి వైసీపీ నేతలు గట్టిగానే ట్రై చేశారు. కానీ వేటు వేయించలేకపోయింది.

ఇదే క్రమంలో రాజు గారే తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. అయితే వారం రోజులు టైమ్ ఇస్తున్నానని ఈలోపు వైసీపీ వేటు వేయించుకోవచ్చని లేదంటే..మాకు చేత కాదు అని ఒప్పుకోవాలని అప్పుడు తాను రాజీనామా చేస్తానని చెప్పి రాజు గారు అంటున్నారు. అయితే ఎంపీ పదవికి ఎప్పుడు రాజీనామా చేస్తారు? ఏ పార్టీలో చేరతారనే విషయం మాత్రం క్లారిటీ లేదు.

కానీ ఏపీలో జరుగుతున్న చర్చ ప్రకారం రాజు గారు బీజేపీలో చేరి, మళ్ళీ నరసాపురం బరిలో నిలబడతారని ప్రచారం వచ్చింది. అలాగే టీడీపీ-జనసేనల సపోర్ట్ తీసుకుంటారని తెలిసింది. అయితే రాజు గారు బీజేపీలో చేరడంపై టీడీపీ శ్రేణులు అసంతృప్తిగా ఉన్నాయి. బీజేపీ అంటే టీడీపీ శ్రేణులు కాస్త ఆగ్రహంగా ఉన్నారు. దీంతో రాజు గారు బీజేపీలోకి వెళితే టీడీపీ శ్రేణులు సహకరిస్తారా? లేదా? అనేది డౌట్.

ఈ పరిస్తితుల నేపథ్యంలో రఘురామ తన స్ట్రాటజీ మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 5లోగా తనను ఎంపీగా డిస్ క్వాలిఫై చేయించాలని, లేదంటే దమ్ములేని సీఎంగా ఒప్పుకోవాలని జగన్‌కు ఛాలెంజ్ చేశారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో మోదీ, అమిత్‌షా, స్పీకర్‌కు ఎవరికైనా తనపై ఫిర్యాదు చేసుకోవాలన్నారు. అంటే అప్పటిలోపు డిస్ క్వాలిఫై చేయించలేకపోతే రఘురామ రాజీనామా చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అదే సమయంలో ఆయన బీజేపీలో చేరరని తెలుస్తోంది. ఇండిపెండెంట్‌గానే ఉంటూ…టీడీపీ-జనసేన-బీజేపీల మద్ధతు తీసుకుంటారని తెలిసింది. మరి చూడాలి ఇంకా రాజు గారు ఎన్ని ట్విస్ట్‌లు ఇస్తారో?

Read more RELATED
Recommended to you

Exit mobile version