ఎంతో మంతి హీరోయిన్లు ఉన్నా.. మళయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ కు ఉన్న క్రేజే వేరు. అనుమప కాస్త స్కీన్ షో చేసినా తట్టుకోలేని ఫ్యాన్స్ ఉన్నారు. ట్రెడిషన్ లుక్ లో కనిపించే అనుపమ పరమేశ్వర్ కు తెలుగులో భారీ ఫాలోయింగే ఉంది.
తాజాగా ఈ మళయాళీ ముద్దుగుమ్మ చీరకట్టులో వావ్ అనిపించేలా ఉంది. సంప్రదాయబద్ధంగా ఉన్న ఈ పిక్స్ తెగ వైరల్ అవుతున్నాయి. చీరకట్టులో చేతిలో ఫ్లవర్స్ తో ఎంతో ముద్దుగా ఉంది ఈ భామ.
ఇటీవల కేరళ కొత్త సంవత్సరం ‘ విషు’ పండగ వేడుకల్లో స్పెషల్ గా చీర కట్టులో ఆకట్టుకుంది. తన క్యూట్ లుక్స్ తో అభిమానులను, నెటిజెన్లను ఫిదా చేసింది. బీస్ట్ మూవీలోని ‘ అరబిక్ కుతు ’ సాంగ్ కు స్టెప్పులేసింది.
ఇటీవల తెలుగులో విడుదలైన ‘ రౌడీ బాయ్స్ ’ సినిమాలో హీరోయిన్ గా నటించింది అనుపమ. అయితే ఈ సినిమా అనుకున్నంత హిట్ సాధించలేదు. ఈ సినిమాలో ఎప్పుడూ లేని విధంగా అనుపమ హాట్ గా కనిపించింది. బోల్డ్ సీన్ల, లిప్ లాక్ లతో ఆకట్టుకుంది.
ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో మూడు తెలుగు సినిమాలు ఉన్నాయి. ‘అ ఆ’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అనుపమకు స్టార్ స్టేటస్ రాలేదు.