ఈ ఫోటోలో ఉన్నది స్టార్ హీరోయిన్..ఎవరో గుర్తు పట్టండి..!!

-

చాలా మంది సినీ తారలకు భక్తి కూడా ఎక్కువే..సినిమాల మధ్యలో బ్రేక్ దొరికితే మాత్రం ప్రముఖ పుణ్య క్షేత్రాలను దర్షిస్తూ వస్తున్నారు.ఇప్పుడు మరో హీరోయిన్ గంగమ్మకు భక్తితో మొక్కులుచెల్లించింది.తనదైన అందం, అభినయంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది.షారుఖ్‌, సల్మాన్‌, ఆమిర్‌ఖాన్‌ వంటి స్టార్ల సరసన సందడి చేసింది. కేవలం హీరోయిన్‌గానే కాదు కంటెంట్‌ బేస్డ్‌ లు, వెబ్‌సిరీస్‌లు నిర్మించి సక్సెస్‌ఫుల్‌ ప్రొడ్యూసర్‌గా పేరు తెచ్చుకుంది. లు చేస్తోన్న సమయంలోనే ఓ స్టార్‌ క్రికెటర్‌తో ప్రేమలో పడింది.

 

పెద్దల ఆశీర్వాదంతో మనసిచ్చిన వాడిని మనువాడింది. ఆతర్వాత ఒక ఆడబిడ్డకు అమ్మగా మారింది. మాతృత్వం కారణంగా కొన్ని రోజుల పాట సిల్వర్‌ స్ర్కీన్‌కు దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ మళ్లీ ఓ స్పోర్ట్స్‌ బయోపిక్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది..సినిమాలు, కూతురు భాధ్యతను మోస్తూ పర్ఫెక్ట్ మహిళగా కొనసాగిస్తుంది..

బాలీవుడ్‌ హీరోయిన్‌, విరాట్ కోహ్లీ సతీమణి అనుష్కా శర్మ. ఓ పనుల నిమిత్తం కోల్‌కతా వెళ్లిన అనుష్క తన టూర్‌కు సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో షేర్‌ చేసుకుంది. ఈ ఫొటోల్లో అనుష్క వెంట ఆమె కూతురు వామిక కూడా ఉంది. ఈ సందర్భంగా గంగమ్మకు మొక్కులు చెల్లించుకుంది అనుష్క. అదేవిధంగా తన గారాలపట్టితో కలిసి కోల్‌కతా వీధుల్లో సందడి చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆమె ఝులన్ గోస్వామి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న చక్డా ఎక్స్‌ప్రెస్‌ లో లీడ్‌ రోల్‌ పోషిస్తోంది..ఆ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.. ఆ సినిమా ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి..

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)

Read more RELATED
Recommended to you

Latest news