ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు 9 రోజులపాటు జరగనున్నాయి. ఈ మేరకు బీఏసీలో నిర్ణయం తీసుకున్నారు. మార్చి 24 వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనుండగా.. 16వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన జరిగిన బిఎసి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
మార్చి 15వ తేదీన గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం, మార్చి 16వ తేదీన 2023 – 24 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రవేశపెడతారు. మార్చి 19న సెలవు కాగా.. మార్చ్ 22న ఉగాది సందర్భంగా సెలవు. ఇక మార్చి 23న ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు. అలా ఈనెల 24 వరకు అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. బిఎసి సమావేశానికి సీఎం జగన్, ఆర్థిక మంత్రి బుగ్గన, పెద్దిరెడ్డి, జోగి రమేష్, టిడిపి నుండి అచ్చెన్నాయుడు హాజరయ్యారు.