దేశంలోనే ప్రముఖ స్టార్టప్ హబ్‌గా హైదరాబాద్‌ : ఏపీ బీఆర్‌ఎస్‌ చీఫ్‌

-

హైదరాబాద్ నగరం దేశంలోనే ప్రముఖ స్టార్టప్ హబ్ గా నిలుస్తోందన్నారు బీఆర్ఎస్ పార్టీ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఐటీ కంపెనీలకు హైదరాబాద్ నగరం చిరునామాగా మారిందని అన్నారు. ఇదంతా మంత్రి కేటీఆర్ చలవేనని తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్ లా శ్రమిస్తున్న కేటీఆర్ రోజుకొక పరిశ్రమను రాష్ట్రానికి తీసుకురావడమే ధ్యేయంగా పెట్టుకున్నారని కొనియాడారు. ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న కేటీఆర్ రోజుకొక కొత్త కంపెనీని హైదరాబాద్ తీసుకువస్తున్నారని వివరించారు.

Thota Chandrasekhar to head BRS AP unit

కానీ, ఏపీలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని, తెలంగాణ తరహా అభివృద్ధి ఇక్కడ మచ్చుకైనా కనిపించడం లేదని తోట చంద్రశేఖర్ విమర్శించారు. రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రావడం లేదని తెలిపారు. ఒక్క పెద్ద ఐటీ కంపెనీ వచ్చిన దాఖాలు లేవని, వచ్చిన పెట్టుబడులు కూడా వెనక్కిపోతున్నాయని తోట చంద్రశేఖర్ విమర్శించారు. వీళ్లకు ఆర్భాటం ఎక్కువ, చేసేది తక్కువ అని ఎద్దేవా చేశారు. రూ.13 లక్షల కోట్ల విలువైన ఎంవోయూలు చేసుకున్నామని చెబుతున్నారని, అందులో రాష్ట్రానికి వచ్చింది పూజ్యం అని, ఉద్యోగాల కల్పన శూన్యం అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news