ప్రారంభమైన ఏపీ కేబినెట్.. ఈ 57 అంశాలే ఎజెండా

-

కాసేపటి క్రితమే ఏపీ క్యాబినెట్ ప్రారంభమైంది. 57 అంశాలతో క్యాబినెట్ అజెండా రూపొందించింది. వైఎస్సార్ చేయూత పై స్టేటస్ నివేదికను క్యాబినెట్ ఆమోదించే అవకాశం ఉన్నట్లు సమాచారం. గ్రేటర్ విశాఖ, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో లక్ష ఇళ్ల నిర్మాణానికి పాలనా అనుమతుల పై ఆమోద ముద్ర వేయనున్న క్యాబినెట్…నియామకాలు, ప్రమోషన్లలో డిజేబుల్ వ్యక్తులకు 4 శాతం రిజర్వేషన్ కు పచ్చజెండా ఊపనుంది.

cm jagan

సచివాలయంలో వివిధ క్యాటగిరీల్లో 85 అదనపు పోస్టుల ఏర్పాటుకు పచ్చజెండా ఊపనున్న మంత్రిమండలి…సీఆర్డీఏ చట్టంలో కొన్ని సవరణల పై చర్చించి ఆమోదించనున్నారు. నెల్లూరు, కర్నూలు, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో శాశ్వత లోక్ అదాలత్ ల ఏర్పాటుకు ఆమోద ముద్ర వేయనున్న క్యాబినెట్…ఒక్కో అదాలత్ కు 10 పోస్టులను ఆమోదించనునుంది.

కియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కు స్టాంప్ డ్యూటీ, ట్రాన్స్ ఫర్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీ మినహాయింపును ర్యాటీఫై చేయనున్న క్యాబినెట్… తిరుపతిలో పేరూరు గ్రామంలో నోవోటల్ బ్రాండ్ కింద ఫైవ్ స్టార్ హోటల్ , ఇంటర్నేషన్ కన్వెన్షన్ సెంటర్, ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ సెంటర్ ఏర్పాటుకు ఆమోద ముద్ర వేయనున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version