ఏపీలో మరోసారి మంత్రివర్గ విస్తరణ జరగనున్నట్లు తెలుస్తోంది. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు. ఆయన కేబినెట్‌లో పని చేస్తున్న ముగ్గురు, నలుగురు మంత్రులకు ఉద్వాసన పలుకుతారని తెలుస్తోంది. వారి స్థానంలో కొత్తగా ఎన్నికయ్యే ఎమ్మెల్సీలకు అవకాశం కల్పిస్తారని ప్రచారం జరుగుతోంది. దీంతో ఆ ముగ్గురు, నలుగురు ఎవరనేదానిపై ఉత్కంఠ నెలకొంది. కాగా సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుటికే రెండుసార్లు కేబినెట్‌ను ఎంపిక చేశారు. తొలి కేబినెట్‌లో ఎంపికైన మంత్రుల్లో ముగ్గురు, నలుగురు మినహా మిగిలిన వారందరినీ రెండో కేబినెట్‌లో తొలగించారు. ఇప్పుడు మూడోసారి కూడా మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు చేస్తారని ప్రచారం జరుగుతోంది.
ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత అధికారికంగా ప్రకటిస్తారని అంటున్నారు. రాష్ట్రంలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలుప్రస్తుతం రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎమ్మెల్సీలుగా గెలుపొందిన వారిలో ముగ్గురు, నలుగురిని మంత్రి వర్గంలో తీసుకోవాలని భావిస్తున్నారట. పార్టీ కోసం పని చేసి పదవులు రాని కొందరికి ఎమ్మెల్సీలుగా అవకాశం ఇచ్చి మంత్రులను చేయలనే ఆలోచనలో సీఎం జగన్ ఉన్నారట. ఈ మేరకు సీఎం జగన్ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.