గవర్నర్‌ బిశ్వభూషణ్‌కు సీఎం జగన్ ఆత్మీయ వీడ్కోలు

-

ఛత్తీస్‌గఢ్‌కు నూతన గవర్నర్‌గా నియామకమైన ఏపీ మాజీ గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్​ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఘనంగా వీడ్కోలు పలికింది. గన్నవరం ఎయిర్​పోర్టులో ముఖ్యమంత్రి జగన్, సీఎస్‌ జవహర్‌ రెడ్డి, కృష్ణా జిల్లా కలెక్టర్‌ రంజిత్‌ భాషా, ఇతర ఉన్నతాధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు ఆత్మీయ వీడ్కోలు పలికారు. పోలీసులు గౌరవ వందనం చేశారు. అనంతరం గవర్నర్‌ విజయవాడ నుంచి ఛత్తీస్‌గఢ్‌కు బయల్దేరి వెళ్లారు.

ఆంధ్రప్రదేశ్‌ పట్ల తనకు ఎప్పటికీ అభిమానం ఉంటుందని బిశ్వభూషణ్‌ హరిచందన్‌ చెప్పారు. సుమారు 44 నెలలపాటు రాష్ట్ర గవర్నర్‌గా పనిచేసేందుకు తనకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు బిశ్వభూషణ్‌ దంపతులకు రాజ్‌భవన్‌ అధికారులు, సిబ్బంది వీడ్కోలు పలికారు.

రాజ్‌భవన్‌లోని దర్బార్‌ హాల్‌లో ఈ కార్యక్రమం నిర్వహించారు. రాజ్‌భవన్‌ అధికారులు, సిబ్బంది నుంచి తనకు లభించిన సహకారం వల్లే గత మూడున్నరేళ్లుగా రాష్ట్ర గవర్నర్‌గా ఫలవంతమైన పదవీకాలం కొనసాగిందన్నారు. బిశ్వభూషణ్‌కు గవర్నర్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, రాజభవన్‌ సిబ్బంది జ్ఞాపికను అందజేసి సత్కరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version