ఏపీ మహిళలు, రైతులకు జగన్ మోహన్ రెడ్డి సర్కార్ తీపికబురు చెప్పింది. ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి అధ్యక్షతన 219 వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం నిన్న జరిగింది. 2022-23 వార్షిక రుణ ప్రణాళికకు ఎస్ఎల్బీసీ వెల్లడించగా.. ఇందులో 51.56 శాతం వ్యవసాయ రంగానికి రూ.164740 కోట్లు కేటాయించారు. 2021-22 లో నిర్దేశించుకున్న మొత్తంలో కౌలు రైతులకు కేవలం 42.53 శాతమే రుణాలు అందాయని జగన్ మోహన్ రెడ్డి తెలిపారు.
కౌలు రైతులకు రుణాలు అందించడంపై బ్యాంకర్లు మరింత శ్రద్ద పెట్టాలని సూచనలు చేశారు. మహిళలపై వడ్డీ భారాన్ని తగ్గించేలా బ్యాంకర్లు చర్యలు తీసుకోవాలని కోరారు. మహిళలకు ఇచ్చే రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. గృహ నిర్మాణలను రాష్ట్రంలో భారీ ఎత్తున చేపట్టాలని.. విలువైన భూముల పట్టాలను పేదలకు అందించామని పేర్కొన్నారు. వీటిపై అప్పులు ఇవ్వడం ద్వారా బ్యాంకులిచ్చే రుణాలకు తగిన భద్రత ఉంటుందని.. పేదలకు అండగా నిలవాలని బ్యాంకులను కోరారు.