థర్డ్‌ వేవ్‌ : ఆరోగ్య శ్రీలో మరో వ్యాధిని చేర్చిన జగన్‌ సర్కార్‌…

-

అమరావతి : థర్డ్‌ వేవ్‌ ముంచుకొస్తున్న తరుణంలో జగన్‌ సర్కార్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వల్ల చిన్నారులకు సంక్రమించే మల్టీ సిస్టమ్ ఇన్ ఫ్లమేటరీ సిండ్రోమ్-మిస్ సీ వ్యాధిని ఆరోగ్య శ్రీ పరిధిలోకి జగన్ సర్కార్ తీసుకోచ్చింది. కరోనా మూడో దశ అంచనా కోసం నియమించిన కోవిడ్-19 టాస్క్ ఫోర్సు కమిటీ సిఫార్సుల మేరకు మిస్ -సిను ఆరోగ్య శ్రీ జాబితాలోకి చేర్చింది వైద్యారోగ్యశాఖ. వ్యాధి తీవ్రతను బట్టి చికిత్సకు అయ్యే ఖర్చును ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ సర్కార్‌.

తీవ్రత ఎక్కువగా ఉంటే చికిత్స కోసం రూ. 77,533.. అదనంగా వెంటిలేటర్ కోసం రూ. 25 వేలుగా నిర్ధారించింది. దీనికంటే తక్కువస్థాయి చికిత్స కోసం రూ. 62,533 వేలు, మోడెరేట్ లెవల్ చికిత్స కోసం రూ. 42,533, మైల్డ్ లెవల్ చికిత్స కోసం రూ. 42,183గా ఖరారు చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీటికి అదనంగా చికిత్సలో వినియోగించే ఇంజెక్షన్ల ఖరీదును ఆరోగ్య శ్రీ పరిధిలోకే ప్రభుత్వం తీసుకొచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version