ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉద్యోగుల బదిలీల గడువు తేదీని పొడిగింపు

-

సీఎం జగన్‌ ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త చెప్పారు. ఉద్యోగుల బదిలీల గడువును ఈ నెలాఖరు వరకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు. తొలుత ఈనెల 17 వరకే బదిలీలు ఉంటాయని ప్రకటించగా.. కొన్నిశాఖల్లో బదిలీలు పూర్తి కాలేదని ప్రభుత్వానికి సమాచారం వెళ్లింది. అందుకే బదిలీల గడువు పెంచాలని సీఎం జగన్‌కు పలు ఉద్యోగ సంఘాల నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఉద్యోగుల బదిలీల గడువును నెలాఖరు వరకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు చేసింది. ఉద్యోగుల బదిలీకి జగన్ సర్కార్ గత వారమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. జూన్‌ 17లోగా ఉద్యోగుల బదిలీల ప్రక్రియను పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు సీఎం జగన్‌.

YS Jagan, Mamata Banerjee: Opposition leaders' meetingకు ఆహ్వానించినా -  Telugu Oneindia

బదిలీల్లో ఉద్యోగుల అర్హత, ఖాళీల వివరాలు, ఇతర నిబంధనలపై క్లారిటీ ఇచ్చారు సీఎం జగన్‌. అలాగే బదిలీలకు సంబంధించి అధికారుల నుంచి కీలక విషయాలను సీఎం జగన్‌ రాబట్టినట్లు తెలుస్తోంది. ఎలాంటి వివాదాలు, ఆరోపణలు రాకుండా ఉద్యోగుల బదిలీల ప్రక్రియ చేపట్టాలని సూచనలు చేశారు సీఎం జగన్‌. తాము ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న బదిలీలకు లైన్ క్లియర్ కావడం, మరోసారి గడువు పెంచడంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news