పోలీసులకు మరో షాక్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం..!

-

ఏపీ సర్కార్ ఇప్పటికే కొత్త కొత్త పథకాల పేరుతో ఉన్న వాటిని తీసెస్తూ జనాలను ఇబ్బంది పెడుతున్నారు. ఇలాంటి పథకాల ద్వారా ప్రజలలో నమ్మకం పోయి, ప్రభుత్వం పడిపోయే అవకాశాలు ఉన్నా కూడా ఏపీ సర్కార్ వెనక్కి తగ్గడంలేదు..కాగా, తాజాగా ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అందరినీ ఆలోచనలో పడేలా చేసింది.

ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కూడా చర్చనీయాంశంగా మారింది. సీఎం పేరు మీద ఇచ్చే శౌర్య పతకం విలువ రూ.500 ఉండేది. ఉగాది సందర్భంగా పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి శౌర్య పతకాలు ప్రకటిస్తారు. అంటే విధి నిర్వహణలో ధైర్యసాహసాలు చూపిన వారికి ఈ పతకాలు ఇస్తారు. రూ. 500 తక్కువ అయినప్పటికీ సీఎం పేరు మీద పతకాన్ని అందుకుంటున్నదానికి విలువ ఉండేది.

అయితే ప్రభుత్వం హఠాత్తుగా రూ. 500 ఇవ్వలేమని.. దాన్ని రూ. 150కి తగ్గిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. కేంద్ర హోంశాఖ నుంచి వచ్చిన ఈ ఉత్తర్వులు చూసి సీఎం శౌర్యపతకం పొందిన వారు ఖంగుతిన్నారు. ఇప్పటి వరకూ వస్తున్న వాటిలో కూడా రూ. 350 కోత పెట్టిన ప్రభుత్వాన్ని చూసి ఎలా స్పందించాలో తెలియక సతమతమవుతున్నారు. సీఎం వ్యక్తిగత పర్యటనలకు కూడా అత్యంత లగ్జరీ విమానాలు వాడుతున్నారు. ఎలాంటి దూరానికైనా హెలికాఫ్టర్‌లోనే వెళ్తున్నారు. సలహాదారులకు కోట్లకు కోట్లు ఖర్చు చేస్తున్నారు.

మాములుగా ఈ పథకం అనేది సీఎం పీఠానికి ఉండే గౌరవాన్ని సూచిస్తుంది. ఆ పతకానికి ఇచ్చే పారితోషికాన్ని తగ్గించి ఆదా కోసం అంటూ.. విచిత్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు..ఈ పథకం ను తగ్గించడం అంటే సీఎం గౌరవాన్ని తగ్గించినట్లు అని కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు.ఇక ఈ విషయం పై ఏపీ ప్రభుత్వం మరో సారి ఆలోచిస్తుందేమో చూడాలి..

Read more RELATED
Recommended to you

Exit mobile version