తెలంగాణకు షాక్ : కృష్ణ బోర్డుకు ఏపీ సర్కార్ లేఖ

-

70:30 నిష్పత్తిలోనే కృష్ణా జలాల పంపకం జరగాలని కేఆర్ఎంబీకి ఏపీ సర్కార్ లేఖ రాసింది. కృష్ణా జల వివాదాల రెండో ట్రైబ్యునల్ ఆదేశాల ప్రకారం 2021-22 నీటి సంవత్సరానికి ఏపీకి 70 శాతం.. తెలంగాణకు 30 శాతం మేర నీటి పంపకం చేయాలని కేఆర్ఎంబీకి ఏపీ సూచనలు చేసింది. ఉమ్మడి ప్రాజెక్టుల్లో నీటి పంపకాలను ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు చేయలేదని లేఖలో స్పష్టం చేసిన ఏపీ.. ఉమ్మడి ఏపీలో శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నుంచి చెన్నైకి, హైదరబాద్ నగరానికి తాగునీటి సరఫరా విషయంలో మాత్రమే కొన్ని నిబంధనల్ని ఏర్పాటు చేసినట్టు వెల్లడించింది.

నాగార్జున సాగర్ లో విద్యుత్ ఉత్పత్తి, సాగునీటి అవసరాల కోసం ప్రకాశం బ్యారేజీకి నీటి సరఫరా విషయంలో మాత్రమే ఉమ్మడి ఏపీలో ప్రాజెక్టుల వారీగా కొన్ని నిర్ణయాలు చేసినట్టు స్పష్టీకరణ చేసింది ఏపీ.ఏపీ పునర్విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ కూడా రాష్ట్ర అవసరాల కోసం 1059 టీఎంసీల కావాలని ట్రైబ్యునల్ కు విజ్ఞప్తి చేసినట్టు గుర్తు చేసిన ఏపీ… ఈ దశలో 50-50 నిష్పత్తిలో నీటి పంపకాల కోసం తెలంగాణా డిమాండ్ సహేతుకం కాదని పేర్కొంది. తెలంగాణ డిమాండుపై ఏపీ అభిప్రాయం కోరిన కేఆర్ఎంబీ… ఈ మేరకు కేఆర్ఎంబీకి ఏపీ ప్రత్యుత్తరం పంపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version