ఇంటర్ విద్యార్థులకు ఏపీ ఇంటర్ బోర్డు శుభవార్త చెప్పింది. ఇంటర్ ఫలితాలను నేడు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నేడు ఉదయం 12.30 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నారు. పరీక్షలకు హాజరైన విద్యార్థులు తమ ఫలితాలను https://bie.ap.gov.in/ వెబ్ సైట్లో చెక్ చేసుకోవచ్చు. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ లో ఉత్తీర్ణత సాధించాలంటే ప్రతి సబ్జెక్టులో 33 కంటే ఎక్కువ మార్కులు రావాల్సి ఉంటుంది.
90 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వ స్కాలర్ షిప్స్‌కు అర్హత సాధిస్తారు. AP Inter Results 2022 తర్వాత విద్యార్థులకు డిజిటల్ స్కోర్ కార్డ్స్ అందిస్తారు. ఇంటర్ పరీక్షలకు హాజరైన విద్యార్థులు ఫలితాలను ఈ వెబ్‌సైట్ల నుంచి చెక్ చేసుకోవచ్చు.